అందుకే చంపేశా.. వైష్ణవి భర్త హత్య కేసులో సంచలన ట్విస్ట్!

కలం, కరీంనగర్ బ్యూరో: ​ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి (YouTuber Vaishnavi) భర్త హరిబాబు హత్య కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. వైష్ణవి హత్యకు ప్రతికారంగానే హరిబాబును అంతమొందించినట్లు ఆమె సోదరుడు సంతోష్ ఓ వీడియో ద్వారా బహిరంగంగా అంగీకరించాడు.

నా చెల్లిని చంపినవాడిని నేనే చంపేశా

హత్య అనంతరం సంతోష్ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో సంచలనం సృష్టిస్తోంది. ​“నా చెల్లిని చంపినవాడిని నేనే చంపేశాను. నా చెల్లి వైష్ణవికి జరిగిన ఘోరం, అన్యాయం సమాజంలో మరే ఆడబిడ్డకు జరగకూడదు” అంటూ సంతోష్ ఆ వీడియోలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.

​కోరుట్ల పోలీసులకు లొంగుబాటు

హరిబాబును హత్య చేసిన అనంతరం సంతోశ్ నేరుగా వెళ్లి కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. గతేడాది వైష్ణవి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినప్పటి నుంచి ఆమె కుటుంబ సభ్యులకు, భర్త హరిబాబుకు మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది. చెల్లి మరణానికి హరిబాబు కారణమని పగ పెంచుకున్న సంతోష్, సమయం చూసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ​వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, లొంగిపోయిన సంతోశ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు. ఈ హత్యలో ఇతర వ్యక్తుల ప్రమేయం ఏదైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

చిట్టికి న్యాయం జరిగింది– సంతోశ్ భార్య సెల్ఫీ వీడియో

ఈ ఘటనపై నిందితుడు సంతోష్ భార్య సైతం ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. గతేడాది సరిగ్గా ఇదే రోజున (సెప్టెంబరు 17) వైష్ణవి (చిట్టి) హత్యకు గురైందని ఆమె గుర్తుచేసింది. హరిబాబు హత్యతో తమ చిట్టి ఆత్మకు శాంతి చేకూరిందని, ఆమెకు న్యాయం జరిగిందని నమ్ముతున్నట్లు పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>