కలం, జగిత్యాల: జగిత్యాల (Jagtial) జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన సభ్యులు సోమవారం ఎస్పీ అశోక్ కుమార్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అసోసియేషన్ కేవలం సంఘం మాత్రమే కాకుండా.. శాఖ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పోలీస్ అధికారుల సంక్షేమం, పరస్పర సహకారం, వృత్తిపరమైన అభివృద్ధి, సేవా నిబద్ధతను బలోపేతం చేసే వేదికగా నిలవాలని ఆకాంక్షించారు.
పోలీస్ సిబ్బంది సమస్యలను బాధ్యతాయుతంగా గుర్తించి, పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. జిల్లా పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్, జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
అసోసియేషన్ నూతన కార్యవర్గం ఇదే..
• అధ్యక్షుడు: జీవన్ రాజ్ (కానిస్టేబుల్)
• ఉపాధ్యక్షులు: ఆరిఫ్ అలీ ఖాన్ (ఇన్స్పెక్టర్), శ్రీకాంత్(ఎస్ఐ)
• కార్యదర్శి: కిరణ్ కుమార్ (రిజర్వ్ ఇన్స్పెక్టర్)
• జాయింట్ సెక్రటరీ: కేశవేని సత్యనారాయణ (కానిస్టేబుల్)
• ఆర్గనైజింగ్ సెక్రటరీ: పి.మల్లేశం (కానిస్టేబుల్)
• ట్రెజరర్: మాటి రమేష్ (కానిస్టేబుల్)
యూనిట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు..
• అనుగుల మహేష్ (కానిస్టేబుల్)
• ఎ. రాజేశ్వర్ (కానిస్టేబుల్)
• కొలగాని జలపతి (కానిస్టేబుల్)
• డి. సౌందర్య (హెడ్ కానిస్టేబుల్)
• కొలుగాని మల్లేశం (కానిస్టేబుల్)
• గోశెట్టి విద్యానాథ్ (కానిస్టేబుల్)

