కలం, వెబ్ డెస్క్ : బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పీఆర్వో (KTR PRO) మాణిక్య మహేష్ ముదిరాజ్‌ను బొల్లారం పోలీసులు తెల్లవారుజామున నాలుగు గంటలకు 35(3) నోటీసు అందజేసి విడుదల చేశారు. అంతకుముందు నిన్న రాత్రి ఆయనను సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించిన సంగతి తెలిసిందే.
ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజు ఉదయం పది గంటలకు కేటీఆర్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. అనంతరం నాంపల్లి కోర్టులో జరుగుతున్న ఫార్ములా ఈ కేసు విచారణకు ఆయన వ్యక్తిగతంగా హాజరుకానున్నారు.

