Mobile Popup Ad
Mobile Popup Ad

నేటి నుంచి వనమహోత్సవం.. శ్రీకారం చుట్టనున్న సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేడు వనమహోత్సవ (VanaMahotsavam) కార్యక్రమం ఘనంగా ప్రారంభం కానుంది. రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ ఎకో పార్కులో (Gurramguda Eco Park) ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్రంగూడ పార్కులో నాగలింగం మొక్కను నాటనున్నారు. అలాగే రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ నేరేడు మొక్కను నాటనున్నారు.

ఈ ఏడాది వనమహోత్సవంలో (VanaMahotsavam) భాగంగా తెలంగాణవ్యాప్తంగా మొత్తం 16.06 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం రాష్ట్రంలోని 13,242 నర్సరీల్లో మొక్కలను ప్రభుత్వం ముందస్తుగానే సిద్ధం చేసి ఉంచింది.

మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు గుర్రంగూడ ఎకో పార్కులో 17.84 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభించనున్నారు. వీటితో పాటే రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 35.50 కోట్ల రూపాయల విలువైన మరికొన్ని అభివృద్ధి పనులను కూడా సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో హరితహారాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.

Read Also: ఎమ్మెల్యేల ప‌నితీరుపై కాంగ్రెస్ సీక్రెట్ సర్వే..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>