కలం, వెబ్ డెస్క్ : సోచి నుంచి అర్ఖాంజెల్స్క్ నగరానికి బయలుదేరిన రష్యన్ ఎయిర్‌లైన్స్ ‘స్మార్ట్ ఏవియా’కు చెందిన బోయింగ్ విమానం (Russian Smartavia Plane) నల్ల సముద్రం ప్రాంతంలో రాడార్ పరిధి నుంచి అదృశ్యమైంది. విమానం ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా పైలట్లు అత్యవసర పరిస్థితిని సూచించే ‘కోడ్ 7700’ (SOS) సిగ్నల్‌ను పంపిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విమానంలో సిబ్బందితో కలిపి మొత్తం 189 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
సాంకేతిక లోపం కారణంగానే విమానం (Russian Smartavia Plane) ల్యాండ్ అవ్వడానికి ముందు ఇంధనాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించి ఉండవచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఉక్రేనియన్ డ్రోన్ల సంచారం కారణంగా సోచి విమానాశ్రయంలో వందలాది విమానాలు నిలిచిపోయిన నేపథ్యంలో ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం రష్యా అధికారులు బ్లాక్ సీ పరిసర ప్రాంతాల్లో విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read Also: ఎమ్మెల్యేల పనితీరుపై కాంగ్రెస్ సీక్రెట్ సర్వే..!
Follow Us On: Instagram

