Mobile Popup Ad
Mobile Popup Ad

గత ప్రభుత్వ పారిశ్రామిక భూములపై ఎంక్వయిరీ : సీఎం

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2023 డిసెంబరు వరకు పరిశ్రమలకు (Industrial Land) కేటాయించిన భూములు, లాండ్ కన్వర్షన్ యాక్టివిటీస్‌పై ప్రతిపక్ష సభ్యులు లేఖ రాస్తే ఎంక్వయిరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. హిల్ట్ పాలసీని వివాదం చేస్తున్న ప్రతిపక్షాలను తప్పుపట్టారు. కాలుష్యం లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడంలో భాగంగానే హిల్ట పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఈ పాలసీతో గోల్‌మాల్ జరిగిందని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాల ధోరణిని తప్పుపట్టారు. గత ప్రభుత్వం పారిశ్రామిక భూములపై ఫిర్యాదు చేసినా, లేఖ రాసినా ఎలాంటి ఎంక్వయిరీ కోరితే అలాంటిది ఓకే చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. లాండ్ రెగ్యులరైజేషన్ వివరాలపైనా పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు.

హిల్ట్ పాలసీపై (HILT Policy) గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా వెలికితీద్దామన్నారు. ఇప్పుడు తప్పుపడుతున్నవారు గత ప్రభుత్వంలో (BRS) మంత్రులుగా ఎలాంటి విధానాలను అవలంబించారో దర్యాప్తు ద్వారా వెల్లడిద్దామన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఇప్పుడు హిల్ట్ పాలసీలోని అంశాలపై సిట్ లేదా సీబీఐ లేదా ఈడీ లాంటి ఎలాంటి ఎంక్వయిరీలకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. కేటీఆర్, హరీశ్‌రావు దమ్ముంటే ప్రభుత్వానికి లేఖలు రాయాలని సూచించారు.

Read Also: విజన్ డాక్యుమెంట్ పవిత్ర గ్రంధం : సీఎం రేవంత్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>