Mobile Popup Ad
Mobile Popup Ad

బీఆర్ఎస్ పార్టీలో చేరికపై జీవన్ రెడ్డి కీలక నిర్ణయం

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు జీవన్ రెడ్డి (Jeevan Reddy) ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ (KCR) నాయకత్వమే ఎంతో మెరుగని ప్రజలు బలంగా నమ్ముతున్నారని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ హయాంలో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మళ్లీ కేసీఆర్ పాలన వస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగానే తాను బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి వెల్లడించారు.

కేటీఆర్‌తో భేటీపై సర్వత్రా ఆసక్తి

కాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జీవన్‌రెడ్డితో (Jeevan Reddy) నేడు జగిత్యాలలో భేటీ కానుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడంపై అసంతృప్తితో ఉన్న జీవన్‌రెడ్డిని, కేటీఆర్ (KTR) స్వయంగా కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఈ భేటీ అనంతరం ఆయన బీఆర్‌ఎస్‌లో చేరికపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: జనాభా లెక్కలు.. ఎన్నో ప్రశ్నలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>