Mobile Popup Ad
Mobile Popup Ad

రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య.. నేపాల్‌కు తెలంగాణ పోలీసులు

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో దారుణ హత్యకు గురైన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ సతీమణి తనూజ రంజన్ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. హంతకులను పట్టుకునేందుకు తెలంగాణ పోలీసులు (Telangana Police) నేపాల్ సరిహద్దులకు పయనమయ్యారు. నిందితులు వెళ్లిన ప్రాంతాలను సీసీ ఫుటేజ్‌ ఆధారంగా గుర్తించారు. నలుగురు నిందితులు హత్య తర్వాత ఆటోలో నాంపల్లి రైల్వేస్టేషన్‌కు పోయి, అక్కడి నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లినట్టు గుర్తించారు. దీంతో, తెలంగాణ పోలీసులు దిల్లీ, లక్నోతో పాటు నేపాల్‌ సరిహద్దుకు కూడా వెళ్లారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నిరంతరం టీంలను మానిటర్ చేస్తున్నట్లు సమాచారం.

Read Also: ‘విజయ్ అనే నేను..’ రేపే సీఎంగా ప్రమాణ స్వీకారం

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>