రైతుల‌ను మోసం చేస్తున్న అధికారులు, ద‌ళారులు: ఎమ్మెల్యే కొలిక‌పూడి

క‌లం, వెబ్‌డెస్క్‌: అధికారులు, ద‌ళారులు ఏక‌మై రైతుల‌ను మోసం చేస్తున్నార‌ని ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌ రావు (MLA Kolikapudi Srinivasa Rao) ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటలోని కలగర గ్రామంలో గత నెల రోజులుగా ధాన్యం కొనుగోళ్లు జ‌ర‌గ‌డం లేదంటూ రైతులు ఆందోళ‌న‌కు దిగారు. దీంతో ఎమ్మెల్యే క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి రైతుల‌తో మాట్లాడారు. రైతులు నెల రోజులుగా ఇబ్బందులు ప‌డుతున్నా ప‌ట్టించుకోని ఎమ్మార్వోను స‌స్పెండ్ చేయాల‌ని డిమాండ్ చేశారు.

ఎమ్మార్వో ద‌ళారుల‌కు అండ‌గా నిలుస్తున్నార‌ని, దొంగ‌ల‌ను కాపాడుతున్నార‌ని ఆరోపించారు. రైతుల‌కు న్యాయం చేయాల‌ని, రైతుల‌కు అన్యాయం చేసే వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు. ఎమ్మార్వో 20 రోజుల నుంచి రైతుల‌కు సంచులు ఇవ్వ‌డం లేద‌ని ఆరోపించారు. మ‌రోవైపు టీడీపీ వాళ్లంతా దోపిడీ వ్య‌వ‌స్థ‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని రైతులు ఆరోపించారు. వ్యవసాయ శాఖ మంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి మాత్రం పెద్ద పెద్ద మాటలు చెబుతారు కానీ, క్షేత్ర స్థాయిలో ప‌రిస్థితి దారుణంగా ఉంద‌న్నారు.

Read Also: ఏపీ సచివాలయంపై డ్రోన్ కలకలం.. భద్రతా సిబ్బంది ఉలికిపాటు!

Follow Us On: WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>