కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ (Mudiraj Leaders) శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) కలిశారు. ముదిరాజ్ దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ‘బీసీ-డీ’ కేటగిరిలో ముదిరాజ్‌లను బీసీ-ఏ కేటగిరిలోకి మార్చాలని కోరారు. దీంతో ముదిరాజ్ యువతకు విద్య, ఉద్యోగాలు, సంక్షేమ పథకాల్లో మరిన్ని అవకాశాలు లభిస్తాయన్నారు. అలాగే సామాజిక న్యాయం బలపడుతుందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
ముదిరాజ్ సమస్యపై సీఎం సానుకూలంగా స్పందించారు. ప్రధాన కార్యదర్శి శేషాద్రిని ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలించి, పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. అలాగే బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి కొండా సురేఖ, మంత్రి శ్రీహరి.. బీసీ కమిషన్‌తో చర్చించి సమస్య పరిష్కారానికి సంబంధించి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించినట్లు తెలిపారు. కాసాని జ్ఞానేశ్వర్, ఈటల రాజేందర్, బండ ప్రకాశ్‌తో సంప్రదింపులు జరిపి వీలైనంత త్వరగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. సీఎంను కలిసినవారిలో హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు , టీపీసీసీ కార్యదర్శి వెంకటేశ్‌తోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
Read Also: రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య.. నేపాల్‌కు తెలంగాణ పోలీసులు
Follow Us On: WhatsApp

