కలం, డెస్క్ : భారతీయ మజ్దూర్ సంఘం (బీఎంఎస్) జాతీయ అధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన సుంకరి మల్లేశం ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఒడిశాలో జరుగుతున్న బీఎంఎస్ (BMS) జాతీయ మహాసభల్లో ఆదివారం జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇందులో రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన సుంకరి మల్లేశం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన గతంలో బీఎంఎస్ తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేశారు. ESI కొర్పొరేషన్ సభ్యుడిగా సేవలందించిన మల్లేశం ప్రస్తుతం ఈపీఎఫ్ ట్రస్టీగా ఉన్నారు.
Read Also: పెట్టుబడులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Follow Us On: Sharechat


