పెట్టుబడులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

కలం, డెస్క్ : రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. పెట్టుబడుల గ్రౌండింగ్ ను వేగవంతం చేసేందుకు ఎంవోయూలను స్పీడ్ (స్మార్ట్‌ ప్రోయాక్టివ్‌ ఎఫిషియంట్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ డెలివరీ) విభాగానికి ప్రభుత్వం అప్పగించింది. పెట్టుబడుల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ’స్పీడ్’ విభాగాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రాష్ట్రానికి రెండేళ్లలోనే రికార్డు స్థాయిలో రూ.8.81 లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఆయా సంస్థలు, శాఖలను సమన్వయం చేస్తూ పర్యవేక్షించేందుకు రియల్ టైమ్ డాష్ బోర్డును అధికారులు రూపొందిస్తున్నారు. దీని కోసం ప్రతిశాఖలో ప్రత్యేకంగా సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అధికారిని నియమించాలని చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తాజా ఆదేశాలు జారీ చేశారు.

Read Also: మేడారం హుండీ లెక్కింపు.. 4వరోజు ఆదాయం రూ.2.64 కోట్లు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>