కలం, వెబ్ డెస్క్ : సంక్రాంతి సీజన్ సందర్భంగా సింథటిక్ లేదా నైలాన్ మాంజాను (Nylon Manja), ప్లాస్టిక్ పతంగులను కంట్రోల్ చేయడానికి ఫారెస్ట్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ మాంజాలపై నిషేధం ఉన్నా సరే కొందరు అక్రమంగా అమ్ముతున్నట్టు అధికారుల దృష్టికి వెళ్లింది. రీసెంట్ గా ముగ్గురికి ఈ మాంజాలతో మెడ తెగిపోవడం లాంటి ఘటనలు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక టీమ్స్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పది రేంజ్ ఏరియాల్లో ప్రత్యేకంగా టీమ్స్ ను ఏర్పాటు చేశారు. ఈ టీమ్స్ ఆయా రేంజ్ పరిధిల్లో పెట్రోలింగ్ చేస్తూ మాంజా అక్రమంగా అమ్ముతున్న వారిని పట్టుకోనున్నారు.
హైదరాబాద్ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, ఫ్లైయింగ్ స్క్వాడ్, కీసర, ఉప్పల్, చిలుకూరు రేంజ్ లాంటి పరిధిల్లో ఈ టీమ్స్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఈ సంక్రాంతి సీజన్ లో మాంజా (Nylon Manja) అమ్మకాన్ని పూర్తిగా తగ్గించాలని ఫారెస్ట్ డిపార్టుమెంట్ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఒక్కో టీమ్ లో ఇద్దరు, ముగ్గురు.. హైదరాబాద్ సెంట్రల్ లాంటి పెద్ద రేంజ్ లో ఐదుగురి దాకా మెంబర్స్ ఉంటున్నారు. ఈ నిషేధిత మాంజాలు ఎవరూ అమ్మొద్దని.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రజలు కూడా వీటికి దూరంగా ఉంటూ ప్రశాతంగా పండుగ జరుపుకోవాలని సూచిస్తున్నారు.
Read Also: ‘మున్సిపల్’ ఓటర్ల తుది జాబితా 12న
Follow Us On: Instagram


