కలం, నల్లగొండ బ్యూరో : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) కి మంత్రి పదవి ఇవ్వడంపై ఇంకా సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఎప్పుడూ మంత్రివర్గ విస్తరణ, మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అనే టాపిక్ వచ్చిన రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అంశం చర్చనీయాంశంగా మారుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల మునుగోడు(Munugode) ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవల మూడో విడత ఎన్నికల్లో భాగంగా మునుగోడు నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
త్వరలోనే తనకు మంత్రి పదవి ఖాయమంటూ ఎన్నికల ప్రచారంలో మాట్లాడడం ఉమ్మడి నల్లగొండ రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు దారి తీసింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. ‘ఇగ ఇన్ని రోజులు ఆగిన. మనకు కూడా అదృష్టం ఉంటే ఇంతకంటే మంచి పదవ వస్తది. త్వరలోనే మంత్రి పదవి వస్తుంది’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) సన్నిహితులు తప్పకుండా మంత్రి పదవి వరిస్తుందని మరోసారి ఘంటపదంగా చెబుతున్నారు.
Read Also: నల్సార్ చైర్ ప్రొఫెసర్గా సుప్రీం మాజీ CJI బీఆర్ గవాయ్
Follow Us On: X(Twitter)


