కలం, వెబ్ డెస్క్ : ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధం వల్ల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు పెరిగి .. రానున్న కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని ఆందోళన చెందుతున్న తెలంగాణ ప్రజలకు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా మీ సేవ సర్వీసు (Meeseva Service ) చార్జీలు కూడా పెరిగాయి. యుద్ద తీవ్రత వల్ల నిత్యావసరాల ధరల పెరుగుదల సంభవిస్తున్న వేళ మూలిగే నక్క పై తాటి పండు పడినట్లు ఇప్పుడు ప్రజలు నిత్యం వేర్వేరు అవసరాల కోసం ఆధారపడే మీ సేవ సర్వీసు చార్జీలు కూడా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీంతో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమే రాష్ట్ర ప్రజలకు వడ్డింపులు మొదలయినట్లు తెలుస్తోంది.
కొత్త ఆర్థిక సంవత్సరం ( 2026 ఏప్రిల్ 1) సందర్భంగా మీ సేవల సర్వీసు (Meeseva Service) చార్జీలను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ప్రభుత్వంలో ఏ చిన్న అవసరం ఏర్పడిన జనాలు మీ సేవకు పరుగులు తీస్తుంటారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఇక పై బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, పింఛన్ రిక్వెస్ట్, రేషన్ కార్డు అప్లికేషన్, ఇన్‌కమ్ సర్టిఫికెట్.. ఇలా అన్ని సర్టిఫికెట్లకు రేట్లు పెరగడంతో జనాల బేబులకు చిల్లులు పడినట్లేనని అర్థం అవుతోంది. ఈ మేరకు ప్రభుత్వం ఏ కేటగిరీ సర్వీసులకు చెందిన సర్టిఫికేట్ల పునః జారీ, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ (EC), బర్త్ సర్టిఫికేట్ లకు రూ. 62 పెంచింది. బీ కేటగిరీ సర్వీసులకు చెందిన కులం, ఆదాయం, నివాసం, ఓబీసి, ఫుడ్ సెక్యూరిటీ, బర్త్, డెత్ , ఈడబ్యూసీ, కొత్త ఎలక్ట్రిక్ కనెక్షన్, క్రిమలేయర్, నాన్ క్రిమలేయర్ వంటి సర్టిఫికేట్ లకు రూ. 80 పెంచింది. అంతకుముందు వీటి ధరలు మినిమం ఛార్జీ రూ.35గా ఉండేది. తాజాగా వాటి ధరలను పెంచడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: కేసీఆర్ డైలాగ్ చెప్పిన కవిత
Follow Us On: X(Twitter)

