Mobile Popup Ad
Mobile Popup Ad

విశాఖ‌ను రాజ‌ధాని చేస్తే ఇంత ఖ‌ర్చ‌య్యేది కాదు: ఎంపీ ధ‌ర్మేంద్ర యాద‌వ్‌

క‌లం, వెబ్ డెస్క్‌: అమ‌రావ‌తి చ‌ట్ట‌బ‌ద్ధ‌త బిల్లును (Amaravati Bill) కేంద్రం నేడు పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. ఈ సంద‌ర్భంగా రెండు గంట‌ల పాటు బిల్లుపై చ‌ర్చించేందుకు స్పీక‌ర్ ఓం బిర్లా అనుమ‌తించారు. ఈ సంద‌ర్భంగా స‌మాజ్ వాద్ పార్టీ ఎంపీ ధ‌ర్మేంద్ర యాద‌వ్ (Dharmendra Yadav) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తి చ‌ట్ట‌బ‌ద్ధ‌త బిల్లును ఎస్పీ త‌ర‌ఫున స‌మ‌ర్థిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే విశాఖ‌ను రాజ‌ధానిగా చేసుకొని ఉంటే ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఖ‌ర్చు చేయాల్సిన అవ‌స‌రం ఉండేది కాద‌న్నారు.

రాజ‌ధాని నిర్మాణం కోసం పెద్ద ఎత్తున భూ సేక‌ర‌ణ చేయ‌డంపైనా ధ‌ర్మేంద్ర యాద‌వ్ (Dharmendra Yadav) విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే రాష్ట్రాల హ‌క్కుల కోసం మాత్ర‌మే అమ‌రావ‌తి చ‌ట్ట‌బ‌ద్ధ‌త బిల్లును స‌మ‌ర్థిస్తున్నామ‌ని చెప్పారు. కేంద్రం విభ‌జ‌న స‌మ‌యంలో హామీ ఇచ్చిన విధంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని కోరారు. ఏపీని బీజేపీ మోసం చేస్తోంద‌ని ఆరోపించారు. బీహార్ ప్ర‌జ‌ల లాగానే ఏపీ ప్ర‌జ‌లు కూడా బీజేపీ చేతిలో మోస‌పోతూనే ఉన్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన రైతుల‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు.

Read Also: జగన్ లాంటి వ్యక్తిని జీవితంలో చూడలేదు: సీఎం చంద్రబాబు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>