తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills Bypoll) వేడి రోజురోజుకు అధికం అవుతోంది. ఇప్పటికే ఈ పోటీలో విజయం కోసం మూడు పార్టీలో హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ మాల సంఘాల జేఏసీ(Telangana Mala JAC) కీలక ప్రకటన చేసింది. ఉపఎన్నిక కోసం జిల్లాల వారీగా 200 మంది మాలలు నామినేషన్లు వేయనున్నట్లు వెల్లడించింది. మొత్తం 200 మంది నామినేషన్లు వేస్తారని తెలిపారు. రాష్ట్రంలో ఆరు నెలలుగా జరిగిన ఉద్యోగ నియామకాల్లో ఎస్సీల్లోని 58 కులాలకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొంది. కాంగ్రెస్‌ను ఓడించడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని జేఏసీ ఛైర్మన్ మందాల భాస్కర్, అధ్యక్షుడు చెరుకు రాంచందర్ స్పష్టం చేశారు.
Jubilee Hills Bypoll | ‘‘ఎంపెరికల్ డేటా తీసుకుని, అన్ని వర్గాలతో చర్చించిన వర్గీకరణ చేస్తామని రేవంత్( Revanth Reddy) మాట ఇచ్చారు. కానీ, అవేమీ చేయకుండానే వర్గీకరణ చేశారు. దీని వల్ల 58 కులాల గొంతు కోశారు. రోస్టర్ పాయింట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని వారు తెలిపారు.

