తెలంగాణ పోలీసులకు నూతన డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivadhar Reddy) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్‌లో సివిల్ వివాదాలకు తావు లేదని చెప్పారు. సివిల్ వివాదాలను చూసుకోవడానికి కోర్టులు ఉన్నాయని చెప్పారు. అలా కాకుండా పోలీస్ స్టేషన్ అడ్డాగా సివిల్ పంచాయితీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ సిబ్బందికి డీజీపీ శివధర్ రెడ్డి లేఖ రాశారు. ఆ లేఖలో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు.
‘‘యూనిఫాం, అవినీతి ఒకే దగ్గర ఉండవు. ఒక్క పోలీస్ అధికారి అయినా లంచం తీసుకుంటే డిపార్ట్‌మెంట్ మొత్తానికి చెడ్డపేరు వస్తుంది. డిపార్ట్‌మెంట్‌లో లంచం తీసుకుంటే కఠిన చర్యలు ఉంటాయి. ప్రజల భద్రత పోలీసు ప్రధాన బాధ్యత. పోలీస్ సిబ్బంది వెల్ఫేర్ తన వ్యక్తిగత ప్రయారిటీ. ఫెయిర్ అండ్ ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్ పోలీసింగ్ ఫిలాసఫీ’’ అని డీజీపీ(DGP Shivadhar Reddy) నొక్కిచెప్పారు.
Read Also: ‘జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 200 నామినేషన్లు వేస్తాం’

