గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పడానికి ఏపీ సర్కార్(AP Govt) రెడీ అవుతోంది. వారి పదోన్నతుల అంశంపై కసరత్తు చేస్తోంది. పదోన్నతుల కల్పనపై అధ్యయనం చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీలో పది మంది మంత్రులు ఉండనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఓఎంపై కమిటీలో సభ్యుడిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా ఉన్నారు. ఆయనతో పాటు బాల వీరాంజనేయస్వామి, పయ్యావుల కేశవ్, నారాయణ, సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు, అనిత, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు.
ఈ కమిటీ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి పదోన్నతులు ఇచ్చే విభాగాలు, పద్దతులపై స్టడీ చేస్తుందని ప్రభుత్వం వివరించింది. ఇంటర్మీడియరీ పోస్టులు సృష్టిస్తే వాటికి పే స్కేల్ నిర్ణయించాలని సర్కార్ పేర్కొంది. ఈ పోస్టుల సృష్టిపై చర్చించాలని జీఓఎంను ఆదేశించించి ప్రభుత్వం. ఇతర విభాగాల్లో ఒకే పని స్వభావం కల్గిన ప్రమోషన్ ఛానల్ కల్పించే అంశంపై అధ్యయనం చేయాలని సర్కార్(AP Govt) తెలిపింది.
Read Also: ఆధారలన్నీ త్వరలోనే విడుదల చేస్తా: కోట వినుత

