సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ: మంత్రి పొన్నం

కలం, వెబ్ డెస్క్: మంగళవారం శాసన మండలిలో బీసీ సంక్షేమ శాఖపై (BC Welfare) చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు సంధించిన ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సమాధానమిచ్చారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని, బలహీన వర్గాల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. బీసీ సంఘాల కార్పొరేషన్లను బలోపేతం చేస్తామని, కళ్యాణ లక్ష్మి ఒక్క కేసు కూడా పెండింగ్ లేదని, గ్రీన్ ఛానెల్ ద్వారా క్లియర్ చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

సమగ్ర కుటుంబానికి సంబంధించిన దానిపై కేబినెట్‌లో చర్చించామని, సబ్ కమిటీ రివ్యూ చేసి సభ ముందుంచుతామని తెలిపారు. బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి పని చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఆత్మగౌరవ భవనాలకు స్థలాలు ఇచ్చారని, జీవో ఇచ్చి నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆత్మగౌరవ భవనాలకు నిధులు కేటాయిస్తామని మంత్రి తెలిపారు.

అలాగే విదేశీ స్కాలర్షిప్‌లు సంవత్సరానికి 300 ఉండే ఇప్పుడు 700కి పెంచుకున్నామని సభలో గుర్తుచేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల్లో 327 పాఠశాలలు ఉంటే 27 మాత్రమే సొంత భవనాలు ఉన్నాయన్నారు. గతంలో కిరాయి కట్టలేని పరిస్థితి ఉండేదని, తాళం వేసిన పరిస్థితి చూశామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాళాలు వేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

‘‘కామారెడ్డి డిక్లరేషన్ అమలుచేస్తాం.. బీసీ సబ్ ప్లాన్ చేస్తున్నాం. కులాల కార్పొరేషన్లు నిధులు ఇస్తాం.. బలహీన వర్గాల సంక్షేమంపై (BC Welfare) సభ్యులు సూచనలు తీసుకుంటాం.. గతంలో నిర్లక్ష్యానికి గురైంది. బలహీన వర్గాల కోసం మా గొంతు ఉపయోగిస్తాం. ప్రభుత్వంలో బలహీన వర్గాలకు సంబంధించి కులాల కార్పొరేషన్లు నిధులు కేటాయించడంతో పాటు సంచార జాతులకు కార్పొరేషన్ పరిశీలనలో ఉంది’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Read Also: అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. సరదాగా ముచ్చటించుకున్న ఆ ముగ్గురు

Follow Us On: Facebook

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>