ఎయిర్ పోర్టులో ‘దుర్గాస్తుతి’ చదివిన మాధవీలత.. అంతా షాక్..

కలం, వెబ్ డెస్క్ : బీజేపీ మహిళా నేత మాధవీలత (Madhavi Latha) ఈ మధ్య తరచూ వార్తల్లో ఉంటున్నారు. తాజాగా మరోసారి ఆమె చేసిన పనికి సోషల్ మీడియాలో నానా రచ్చ జరుగుతోంది. ఢిల్లీ ఎయిర్ పోర్టులోని (Delhi Airport) ప్రేయర్ రూమ్ లో ఆమె దుర్గాస్తుతి చదివారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాస్తవానికి ఆమె వెళ్లింది మహిళల ప్రేయర్ రూమ్ లోకి. అందులో ఎవరు ఏమైనా చదువుకోవచ్చు. కాకపోతే నెటిజన్లు ఆమె వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు.

కావాలనే నమాజ్ చేసుకునే సమయంలో వెళ్లి దుర్తాస్తుతి చదువిందని.. ఆ వీడియోలో ముస్లిం మహిళలు కూడా కనిపిస్తున్నారు అంటున్నారు. ముస్లిం మహిళలు వెళ్లే సమయానికి మాధవీలత (Madhavi Latha) వెళ్లారని.. ఇదంతా పొలిటికల్ స్టాండ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరేమో ప్రేయర్ రూమ్ అనేది కేవలం ఒక మతానికి చెందింది కాదని.. అక్కడ అన్ని మతాల వారు ప్రార్థనలు, ఆరాధనలు చేసుకోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం మాధవీలత వీడియో నేషనల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.

Read Also: ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచుతున్న భద్రాద్రి వైద్య సిబ్బంది

Follow Us On: X(Twitter)

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>