కలం, వెబ్ డెస్క్: ఐఏఎస్ అధికారిణిపై వార్తలొచ్చిన ఘటనలో పోలీసులు పలువురు జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ తీవ్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. సీనియర్ జర్నలిస్టుల (Journalists) అరెస్ట్ అక్రమం అని ఖండించింది. ‘సిట్’ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం సదరు జర్నలిస్టులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా అరెస్ట్ (Arrest) చేయటం ఎంతవరకు సరైందని ప్రశ్నించింది.
‘‘ఓ మీడియా కథనంలో ప్రసారమయ్యే కథనాలకు సంస్థ ఎడిటర్, ఛైర్మన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ ఆ సంస్థలో పని చేసే ఉద్యోగులను అరెస్ట్ చేయటమేంటి. జర్నలిస్టులిపై కేసులు నమోదు చేయటం వెనక కుట్ర ఉన్నట్లు కనిపిస్తోంది. బహుజన వర్గాలకు చెందిన జర్నలిస్టులను అరెస్ట్ చేయటాన్ని ఖండిస్తున్నాం’’ తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ తెలిపింది.


