epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

చిరు తో మారుతి మూవీ ఉంటుందా..?

క‌లం వెబ్ డెస్క్ : ఈరోజుల్లో అనే చిన్న సినిమాతో డైరెక్టర్ గా పరిచయమై.. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించి ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ మారుతి(Director Maruthi). ఇక అక్కడ నుంచి కెరీర్ లో వెనకి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)తోనే రాజాసాబ్(Raja saab) అనే సినిమా తీసాడు. ఈ మూవీకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ మాత్రం బాగానే ఉన్నాయి. సంక్రాంతికి ఇంకా స్టార్ట్ కాకుండానే.. 200 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సందర్భంగా మారుతి తన మనసులో మాటలను బయటపెట్టాడు. రాజాసాబ్ ఎక్స్ పీరియన్స్, రిజెల్ట్ గురించి తను ఏం ఫీలయ్యాడు చెప్పాడు.

ఈ మూవీకి ఇంతలా నెగిటీవ్ టాక్ రావడానికి కారణం ఏమన్నాడంటే.. హర్రర్ మూవీస్ చాలా వచ్చాయి. ప్రభాస్ తో హర్రర్ మూవీ అంటే.. చాలా కొత్తగా ఉండాలని హిప్నాటైజ్ అనేది ట్రై చేశాం. జనాలు కొత్తది రిసీవ్ చేసుకోవడానికి టైమ్ పడుతుంది. ఈ సినిమా ప్రభాస్ అభిమానులకు నచ్చింది. చాలామంది మెసేజ్ చేస్తున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ నాకు సోదరుల‌తో సమానం అని చెప్పాడు మారుతి. ఇక ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది అభినందిస్తూ ఫోన్ చేసారని.. నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి బాగా సపోర్ట్ చేశారని చెప్పాడు. ఓల్డ్ గెటప్ కు సంబంధించిన సీన్స్ బాగా సెట్ అయ్యాయి. వీటికి మంచి రెస్పాన్స్ వస్తుందని ప్రభాస్ కు మెసెజ్ చేశాను అన్నాడు మారుతి.

ఇక మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో సినిమా గురించి స్పందిస్తూ.. తను మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిని.. ఆయనతో సినిమా చేసే ఛాన్స్ వస్తే.. తన లైఫ్ సర్కిల్ ఫుల్ అయినట్టు భావిస్తానని అన్నారు. చిరంజీవితో సినిమా చేయాలని మారుతి ట్రై చేస్తున్నాడు కానీ.. ఇంత వరకు సెట్ కాలేదు. చిరు ఇప్పుడు బాబీతో ఓ సినిమా, శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత అంటే టైమ్ పడుతుంది. ఈలోపు మారుతి మరో సినిమా చేసి హిట్ కొడితే ఛాన్స్ ఉండచ్చు. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>