కలం, వెబ్ డెస్క్: ట్రేడింగ్, సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. భారీగా కేసులు నమోదవుతున్నా చాలామంది మోసపోతున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం మోసపోతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. డైరెక్టర్ తేజ (Director Teja) కుమారుడు సైతం మోసపోయాడు. హైదరాబాద్‌లో ఉంటున్న అమితవ్ తేజకు యార్లగడ్డ అనూష, కొండపనేని ప్రణీత్ దంపతులతో పరిచయం ఏర్పడింది. ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించారు. దీంతో అతడు 72 లక్షలు ఇచ్చాడు. నెలలు గడుస్తున్నా.. డబ్బులు ఇవ్వకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. అమితవ్ తేజ హైదరాబాద్ (Hyderabad) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


