Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ జాగృతిలో భారీగా చేరికలు

కలం, వెబ్ డెస్క్ : కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు ముందే తెలంగాణ జాగృతి (Telangana Jagruthi)లో భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీని ప్రకటించబోతున్న వేళ ఆమెకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఆదివారం తెలంగాణ జాగృతిలో చేరారు. సోమవారం పలువురు ముఖ్య నేతలు కూడా తెలంగాణ జాగృతిలో చేరారు.

ఈ మేరకు హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ సహకార సంఘం అధ్యక్షుడు తాటికొండ శ్రీనివాసచారి తన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. అలాగే తెలంగాణ జాగృతి వైస్ ప్రెసిడెంట్ కొట్టాల యాదగిరి ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ బాలయ్య సైతం కవిత (Kavitha) పార్టీలో చేరిపోయారు. ఈ సందర్భంగా వారిని తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సాదరంగా జాగృతిలోకి ఆహ్వానించారు.

Read Also: NDSA మార్గదర్శకాలతోనే పని చేయాలి.. అధికారులకు సీఎం ఆదేశాలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>