Mobile Popup Ad
Mobile Popup Ad

మేడిగడ్డను సందర్శించిన సీఎం రేవంత్.. క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన

కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మంత్రులతో కలిసి మేడిగడ్డ (Medigadda) బ్యారేజీని సందర్శించారు. అక్కడ జరుగుతున్న పునరుద్ధరణ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఎన్డీఎస్ఏ (NDSA) చైర్మన్ అనిల్ జైన్‌లతో కలిసి సీఎం సందర్శించారు. కుంగిపోయిన 20, 21, 22 పియర్స్ వద్ద జరుగుతున్న జియో టెక్నికల్, జియో ఫిజికల్, జీపీఆర్ పరీక్షలను పరిశీలించారు. బ్యారేజీ పునాదుల పటిష్టతను తెలుసుకునేందుకు సీకెంట్ పైల్స్‌కు సంబంధించి నిర్వహిస్తున్న ‘ప్యారలల్ క్రాస్ హోల్ సెస్మిక్ టెస్ట్‘ వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

మొత్తం 520 బోర్ రిగ్స్ ద్వారా సేకరించిన శాంపిల్స్‌ను పుణేలోని సీడబ్ల్యూపీఆర్ఎస్ ల్యాబ్‌కు పంపనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆ ల్యాబ్ నివేదికల ఆధారంగా బ్యారేజీకి జరిగిన నష్టంపై పూర్తి అవగాహన రానుందని అధికారులు వెల్లడించారు. అంతకుముందు సీఎం రేవంత్ ఏరియల్ వ్యూ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించారు.

Read Also: రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి: జీవన్ రెడ్డి

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>