Mobile Popup Ad
Mobile Popup Ad

ఓబన్న జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్యే ఐలయ్య

కలం, యాదగిరిగుట్ట బ్యూరో: వడ్డే ఓబన్న (Vadde Obanna) జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య (MLA Beerla Ilaiah) తెలిపారు. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేనాధిపతి వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం యాదగిరిగుట్టలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల  సామెల్‌తో కలిసి పాల్గొన్నారు. అనంతరం వడ్డెర కులస్థులతో పాటు పలు పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఐలయ్య (MLA Beerla Ilaiah) మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర పోరాటంలో వడ్డె ఓబన్న సేవలు అనిర్వచనీయమని అన్నారు. రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైన్యాధ్యక్షుడిగా ఉంటూ బ్రిటిష్ వారి సేనాలపై సమరసింహంలా విరుచుకుపడి మూడు వేల మంది బ్రిటిష్ సైనికులను మట్టుబెట్టారని కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి ఐలమల్లు, జిల్లా అధ్యక్షులు పల్లపు బాలయ్య, దండ్ల వెంకటయ్య, యాదగిరిగుట్ట చైర్ పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, శివరాత్రి దానయ్య, వడ్డెర నాయకులు, కులస్థులు తదితరులు పాల్గొన్నారు.

Read Also: BRSలో చేరిన అనంతరం జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>