కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించి కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని సందర్శించారు. అనంతరం అనంతరం మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లను పరిశీలించి, రిపేర్లపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల లోపాలపై ఎలా ముందుకెళ్లాలో ఒక స్పష్టత వచ్చిందని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్ (Medigadda Barrage) పునరుద్దరణ పనులల్లో NDSA మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు.
సమస్యను అర్థం చేసుకోవడమే సగం పరిష్కారం అని చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించి సమస్యలను పూర్తిగా అర్థం చేసుకున్నాకే అధికారులు పనులు ప్రారంభించాలని సూచించారు. సేకరించిన శాంపిల్స్ రిజల్ట్ కు అనుగుణంగా పనులు చేపట్టాలని సీఎం సూచించారు. అలాగే, ప్రతి పనిని టెక్నికల్ గా రికార్డు చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రతీ పనిలో NDSA అప్రూవల్ తీసుకుని పనులు చేయాలని ఆయన (CM Revanth Reddy) సూచించారు.
Read Also: జీవన్ రెడ్డికి కీలక పదవి.. ప్రకటించిన కేసీఆర్
Follow Us On: Pinterest

