Mobile Popup Ad
Mobile Popup Ad

నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్ ఆవిష్కరణ

కలం, కరీంనగర్ బ్యూరో: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) నాయకత్వంలో త్వరలో ఆవిర్భవించనున్న నూతన రాజకీయ పార్టీకి సంబంధించిన ఆవిర్భావ సభ వాల్ పోస్టర్‌ను సోమవారం ఘనంగా ఆవిష్కరించారు. కరీంనగర్‌ (Karimnagar) లోని కోర్టు చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం సాక్షిగా జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఈ నెల 25న మేడ్చల్ జిల్లా మునిరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్‌లో  భారీ స్థాయిలో ఆవిర్భావ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ సభకు కరీంనగర్ (Karimnagar) జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతారని, కవితక్క నాయకత్వంలోనే తెలంగాణ భవిష్యత్ మెరుగ్గా ఉంటుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం కూడా రేవంత్ రెడ్డి (Re)  ప్రభుత్వానికి సహకరిస్తోందని విమర్శించారు. పాలకపక్షం, ప్రతిపక్షం రెండూ తమ ఆర్థిక ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తున్నాయని, ప్రజల విషయంలో మాత్రం వేరు వేరు అంటూ నటిస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ మద్దతు కూడా ఈ వ్యవహారాల్లో ఉందని, వారి పార్టీ ఎంపీలు ప్రధానమంత్రికి రాసిన లేఖల ద్వారా ఈ విషయం బయటపడిందని తెలిపారు.

తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ఏకైక నాయకురాలు కేవలం కవితక్క మాత్రమేనని, ఆమె నాయకత్వంలో ఆవిర్భవించబోయే కొత్త రాజకీయ పార్టీపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, బీసీ విభాగం అధ్యక్షుడు శ్రీరాముల రమేష్, ఆదివాసీ విభాగం అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, బుడిగె పర్శారం గౌడ్, గాలిపల్లి రత్నాకర్ చారి, యండి సల్మ, కొలిపాక గౌతమి, లంక మనోజ్, దాసరి అంజలి, బసవేణి రాజేందర్, కుతాడి రాజిత, కొరిమి పద్మ, కుసుంబా మంజుల, పల్లె శారద తదితరులు పాల్గొన్నారు.

Read Also: టైటిల్ కోసం అన్నా చెల్లెళ్ల ఫైట్.. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>