కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఇంటర్మీడియట్ (Inter Results) ఫలితాలు వెలువడిన తర్వాత విద్యార్థుల ఆత్మహత్యలు (Suicides) ఆందోళన కలిగిస్తున్నాయి. ఫలితాల్లో ఉత్తీర్ణులు కాలేదన్న మనోవేదనతో గత మూడు రోజుల్లోనే 13 మంది విద్యార్థులు తనువు చాలించడం తీవ్ర విషాదాన్ని నింపింది. తాజాగా మరో ఐదుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం ఎన్.జీ. హంక్రాన్ గ్రామంలో రమేశ్ (17), నాగల్‌గిద్ద మండలం కారముంగి గ్రామానికి చెందిన నందిని (17) ఫలితాలు చూసుకున్న తర్వాత తీవ్ర నిరాశకు లోనై ఆత్మహత్య చేసుకున్నారు.
నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం గొల్లమాడ గ్రామానికి చెందిన మణివర్ధన్, అదే జిల్లా ఖానాపూర్ ప్రాంతానికి చెందిన భూక్యా ఆకాష్ (18) పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న బాధతో ప్రాణాలు తీసుకున్నారు. అలాగే సిద్దిపేట జిల్లా రంగనాయకపురం గ్రామానికి చెందిన పొట్ల ప్రత్యూష (17) కూడా ఆత్మహత్య చేసుకుంది. స్వల్ప మార్కులతో ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చినా అధైర్యపడవద్దని విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ద్వారా మళ్ళీ రాణించే అవకాశం ఉంటుందని విద్యార్థులకు అధికారులు విజ్ఞప్తి చేశారు.
Read Also: నకిలీ CISF అధికారి హల్‌చల్: పెళ్లి పేరుతో 67 మందికి టోకరా !
Follow Us On : WhatsApp

