కలం, కరీంనగర్ బ్యూరో : గిరిజన వనదేవతలు సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు మేడారం (Mini Medaram) ముస్తాబు అవుతుండగా.. ఇంకోవైపు మినీ మేడారాలు కూడా ముస్తాబవుతున్నాయి. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లోని పలు గ్రామాల్లో సమ్మక్క, సారలమ్మ మినీ జాతరలు ఈ నెల 28 నుంచి 31 దాకా నిర్వహిస్తారు. ఈ జాతరలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
ఈ జాతరలకు భక్తులు రావడానికి రోడ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు క్యూలైన్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు స్నానాలు చేయడానికి తాత్కాళిక గదుల నిర్మాణాలు, తాగు నీరు, టాయిలెట్లు, పారిశుధ్య ఏర్పాట్లపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మినీ మేడారం జాతరల పనుల కోసం ప్రభుత్వం కోటికి పైగా నిధులు కేటాయించింది.

Read Also: మెరిసిన హర్మన్‌ప్రీత్.. ముంబైదే గెలుపు
Follow Us On: Pinterest


