కలం, వెబ్ డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao)లకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో పెద్ద ఊరట లభించింది. ఈ కమిషన్ సమర్పించిన నివేదికను నిలిపివేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ తన విచారణలో సరైన నిబంధనలను పాటించలేదని ధర్మాసనం ఈ సందర్భంగా అభిప్రాయపడింది.
సెక్షన్ 8 కింద ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒక వ్యక్తిపై ఆరోపణలు చేయడం లేదా నివేదికలో పేర్కొనడం సరైన పద్ధతి కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (PC Ghose) ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు (Kaleshwaram Project) సంబంధించి కమిషన్ ఇచ్చిన నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసీఆర్, హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వారి వాదనలను విన్న న్యాయస్థానం, ప్రస్తుతానికి ఆ నివేదిక అమలుపై స్టే విధిస్తూ ఊరటనిచ్చింది. ఈ తీర్పుతో గత కొంతకాలంగా సాగుతున్న కమిషన్ విచారణ ప్రక్రియకు బ్రేక్ పడినట్లయింది.
Read Also: క్రాస్ రోడ్స్ లో కాళేశ్వరం.. BRS లో టెన్షన్..
Follow Us On: WhatsApp

