Mobile Popup Ad
Mobile Popup Ad

ఆర్టీసీ సమ్మెతో ఇతర రాష్ట్ర బస్సులకు భారీ డిమాండ్

కలం, మెదక్ బ్యూరో : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె (TGSRTC Strike) కారణంగా రాష్ట్రంలో బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ఇతర రాష్ట్రాల బస్సులకు భారీ డిమాండ్ ఏర్పడింది. యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో నిన్న అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి దిగారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని జహీరాబాద్ బస్ డిపో (Zaheerabad bus stand) వద్ద కూడా కార్మికులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా కర్ణాటక, మహారాష్ట్ర బస్సులను ఆశ్రయిస్తున్నారు.

జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే కర్ణాటక బస్సుల్లో భారీగా తెలంగాణ ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అలాగే నాందేడ్–అకోలా హైవే, పిట్లం–బిచ్కుంద మార్గాల్లో నడిచే మహారాష్ట్ర బస్సులు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సమ్మె ప్రభావంతో సరిహద్దు ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల బస్సులకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>