Mobile Popup Ad
Mobile Popup Ad

క్రాస్ రోడ్స్ లో కాళేశ్వరం.. BRS లో టెన్షన్..

కలం, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) తెలంగాణ రైతాంగానికి వరమా? శాపమా? దాదాపు 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. లక్ష కోట్లు ఖర్చయింది. డిజైన్ మొదలు నిర్మాణం వరకు లోపాలతో మూడు బ్యారేజీలు నిరుపయోగమయ్యాయి. వాటి రిపేర్లపై ప్రస్తుతం ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ‘ఉత్తర తెలంగాణ రైతాంగానికి జీవధార’ అన్నది బీఆర్ఎస్ వాదన. కరప్షన్, కమిషన్‌లతో ప్రజాధనం దుర్వినియోగమైందన్నది కాంగ్రెస్ వాదన.

ఎవరి వాదన ఎలా ఉన్నా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (PC Ghose Commission) మాత్రం ఈ ప్రాజెక్టు ఆలోచన మొదలు ప్రారంభోత్సవం వరకు అనేక లోపాలు జరిగాయని ఎత్తిచూపింది. ‘కాగ్’ సైతం ప్రజాధనం దుబారా జరిగిందని, ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్థంగా ఉన్నదని విశ్లేషించింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీరు ఎంత అందిందనేది సమాధానం లేని మిలియన్ డాలర్ల ప్రశ్న. కానీ ప్రాజెక్టుకు ఖర్చు చేసిన లక్ష కోట్లలో దాదాపు 84 వేల కోట్ల అప్పులు రాష్ట్ర ఖజానాకు భారంగా మారింది.

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు బ్యారేజీలు, టన్నెళ్లు, గ్రావిటీ కెనాళ్లు, రిజర్వాయర్లు, పంప్ హౌజ్‌లు, లిఫ్టులు.. అంటూ ఎన్ని చెప్పినా ఇప్పుడది అలంకారప్రాయమే. అవినీతి, అవకతవకలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఎంక్వయిరీ కమిషన్‌ సుదీర్ఘ విచారణల అనంతరం నివేదిక ప్రభుత్వానికి చేరింది. కేసీఆర్, హరీశ్‌రావు, బ్యూరోక్రాట్లు, ఇరిగేషన్ అధికారులు, ఇంజినీర్ల తప్పిదాలను కమిషన్ ఎత్తిచూపింది.

ప్రభుత్వం అరెస్టు చేస్తుందేమో.. చర్యలు తీసుకుంటుందేమో.. అనే ఆందోళనతో కేసీఆర్, హరీశ్‌రావు సహా నలుగురు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ, వాదనలు ముగిశాయి. తుది తీర్పు ఏప్రిల్ 22న వెలువడనున్నది. ఆగమేఘాల మీద హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లి సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. హైకోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే సుప్రీంకోర్టులో సవాలు చేయాలనే కసరత్తు మొదలైంది.

దోషుల్ని వదిలేది లేదని సీఎం రేవంత్ పదేపదే చెప్తున్నారు. సీబీఐ దర్యాప్తు కోసం కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ప్రాజెక్టులో ఎలాంటి అవకతవకలు జరిగాయి? జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏం తేల్చింది? నివేదికలో ఏమున్నది? కేసీఆర్, హరీశ్‌రావు ఆందోళన ఏంటి? హైకోర్టును ఎందుకు ఆశ్రయించారు? విచారణలో జరిగిన వాదనలేంటి? రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నది? కాళేశ్వరం ప్రాజెక్టుపై ‘కలం 360 డిగ్రీస్’ స్పెషల్.. పేజ్ కోసం కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Kaleshwaram Project
Kaleshwaram Project

Read Also: అజారుద్దీన్‌కు లైన్ క్లియర్ ?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>