epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

హైడ్రాపై హైకోర్టు సీరియస్

హైడ్రా(Hydraa)పై మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించే విధంగా వ్యవహరిస్తోందని.. కోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని హైకోర్టు(High Court) మండిపడింది. సున్నం చెరువు కూల్చివేతలు, ఫెన్సింగ్ ఏర్పాటు, భూసరిహద్దుల నిర్ధారణలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టిన ఈ మేరకు వ్యాఖ్యానించింది.

హైడ్రా(Hydraa) అధికారులు కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ముందుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. “మా ఆదేశాలు ఉండగానే ఫెన్సింగ్ ఎందుకు వేశారు? ఏ అధికారంతో ఈ చర్యలు తీసుకున్నారు?” అని ప్రశ్నించింది. సున్నం చెరువు పరిసరాల్లో చేపట్టిన కూల్చివేతల విషయంలో నిబంధనలు, కోర్టు ఆదేశాలు, ప్రజా హక్కులు అన్నీ పక్కనపెట్టేశారని బెంచ్ వ్యాఖ్యానించింది.

నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఇచ్చిన నివేదికను హైడ్రా ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదంటూ కోర్టు గట్టిగా ప్రశ్నించింది. ఆ నివేదికలో ఉన్న ముఖ్యమైన సూచనలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలను పక్కనబెట్టి అధికారులు ఎలా నిర్ణయాలు తీసుకున్నారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది.

ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) నిర్ధారణ లేకుండానే కూల్చివేతలు చేపట్టడంపై కూడా కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. “ఎఫ్‌టీఎల్ నిర్ణయించకుండా కూల్చివేతలు ఎలా చేపడతారంటూ ప్రశ్నించింది. ఎలాంటి సాంకేతిక ఆధారాలు లేకుండా ప్రజల ఆస్తులను ధ్వంసం చేయడమేంటి?” అని కోర్టు ప్రశ్నించింది. ప్రజల హక్కులు, పర్యావరణం, నిబంధనలు ఏ అంశాన్నీ పరిగణనలోకి తీసుకోని విధంగా హైడ్రా వ్యవహరిస్తోందని కోర్టు కఠినంగా వ్యాఖ్యానించింది.

హైడ్రా అధికారులు అందించిన నివేదనను పరిశీలించిన అనంతరం, హైకోర్టు మరిన్ని వివరాలు, పూర్తి స్థాయి ఆధారాలు సమర్పించాలని ఆదేశించింది. చెరువు పరిధి, భూసర్వే వివరాలు, ఎన్‌జీటీ సూచనలు, ఎఫ్‌టీఎల్ మార్కింగ్ అన్నిటినీ స్పష్టమైన ఆధారాలతో సమర్పించాలని కోర్టు స్పష్టం చేసింది.

Read Also: మెడికల్ కాలేజీల అనుమతుల్లో గోల్‌మాల్

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>