కలం, వెబ్ డెస్క్: ఇద్దరు ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు (TG High Court) నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు ఉన్నపటికీ, RTI చట్టం కింద సమాచారం అందించకపోవడంతో చర్యలు తీసుకుంది. ఈ మేరకు మాజీ జీహెచ్ఎంసీ కమిషనర్ కె.ఇలంబర్తి, ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్లకు నోటీసులు జారీ చేసింది. వడ్డం శ్యామ్ అనే వ్యక్తి RTI చట్టం ప్రకారం అడిగిన సమాచారం ఇవ్వాలని కోరాడు. సమాచారం అందకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు ఆదేశించినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో నవంబర్ 24న మరోసారి వడ్డం శ్యామ్ పిటిషన్ దాఖలు చేశాడు.
ఈ పిటిషన్ విచారిస్తూ.. కోర్టు ధిక్కరణ కింద వారిపై చర్యలు ఎందుకు తీసుకోవద్దో తెలపాలని ఐఏఎస్ అధికారులపై (IAS Officers) మండిపడింది. కోర్టు ఆదేశాలు ఎందుకు పాటించలేదో వివరిస్తూ జనవరి 26 లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక పేర్కొన్నారు. లేదంటే వారి అఫిడవిట్లు స్వీకరించమని, రూ.10,000 జరిమానా కూడా విధించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హైకోర్టు(High Court) హెచ్చరించింది.
Read Also: కళ్యాణ్ ఆర్మీ ఆఫీసర్ కాదా.. ఏంటీ రచ్చ..?
Follow Us On: X(Twitter)


