కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు హైకోర్టులో ఊరట

క‌లం, వెబ్ డెస్క్‌: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్యపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన కేసులో కాంగ్రెస్ అగ్రనేత పవన్ ఖేరా (Pawan Khera)కు తెలంగాణ హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ కె.సుజన ధర్మాసనం పవన్ ఖేరాకు వారం రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స‌మ‌యంలో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అలాగే విచార‌ణ‌కు అన్ని విధాలా స‌హ‌క‌రించాల‌ని ప‌వ‌న్ ఖేరాకు సూచించింది. తాము మూడు వారాల పాటు బెయిల్‌ కోరగా, కోర్టు ప్రస్తుతానికి ఒక వారం గడువు ఇచ్చిందని, చట్టపరంగా త‌దుప‌రి ప్రక్రియను అనుసరిస్తామని ప‌వ‌న్ ఖేరా తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

Read Also: బీఆర్ఎస్‌లోకి జీవ‌న్ రెడ్డి.. దానం నాగేంద‌ర్ రియాక్ష‌న్‌!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>