హుస్నాబాద్‌లో బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం

కలం, కరీంనగర్ బ్యూరో: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ (Husnabad) మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ సావుల మంజుల తండ్రి ఆకస్మిక మృతిచెందారు. విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) రేణిగుంటలోని వారి నివాసానికి చేరుకుని మృతుడి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనందరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

తర్వాత హుస్నాబాద్ పట్టణ యూత్ కాంగ్రెస్ నాయకులు గట్టు సాయి కుమార్ తల్లి ఇటీవల మృతి చెందడంతో వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల మృతిచెందిన 6వ వార్డు కౌన్సిలర్ భూక్య సంపత్ కుమార్తె సోనా చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కష్ట సమయంలో ఆ కుటుంబాలకు పార్టీ పరంగా, వ్యక్తిగతంగా అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>