కలం, వెబ్ డెస్క్: జీవన్ రెడ్డి (Jeevan Reddy) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతుండటంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘ కాలం సేవలు అందించిన జీవన్ రెడ్డి పార్టీని వీడటం బాధాకరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు జీవన్ రెడ్డికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారన్నారు. తనతో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలున్న సమావేశంలో జీవన్ రెడ్డికి రాజ్యసభ ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లు చెప్పారని గుర్తు చేశారు.
మంత్రులు శ్రీధర్ బాబు (Sridhar Babu), అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) వంటి వారు స్వయంగా వెళ్లి జీవన్ రెడ్డిని పార్టీ మారొద్దని కోరారన్నారు. ఆ తర్వాత కూడా టీపీసీసీ చీఫ్ సహా పలువురు నాయకులు ఇంటికి వెళ్లి జీవన్ రెడ్డితో మాట్లాడారని చెప్పారు. అయినా జీవన్ రెడ్డి తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. కానీ, రాజకీయంగా ఆయన ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటానని దానం (Danam Nagender) స్పష్టం చేశారు.
Read Also: కేసీఆర్‌తో జీవన్ రెడ్డి లంచ్ మీటింగ్
Follow Us On: Facebook

