‘రాకా’ కోసం దీపికా పదుకొణె కళ్లు చెదిరే రెమ్యూనరేషన్​

కలం, వెబ్ డెస్క్: అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం రాకా (Raaka) కోసం దీపికా పదుకొణె (Deepika Padukone) రికార్డు స్థాయి పారితోషికాన్ని అందుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ఆమె దాదాపు రూ.20 నుంచి 25 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. దీపికా కెరీర్‌లోనే ఇది అత్యధిక పారితోషికం. దక్షిణాది సినిమాల్లో హీరోయిన్‌కు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం టాలీవుడ్​లో ఆసక్తిని రేపుతోంది.

సుమారు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో దీపికా (Deepika Padukone) కీలకమైన పాత్రలో (యోధురాలిగా) కనిపించనున్నారు. ఈమెతోపాటు మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం 2027 వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Read Also: ప్రతిరోజూ ఫుల్ బాటిల్​ తాగేవాడిని.. అమీర్​ ఖాన్​ కీలక వ్యాఖ్యలు

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>