ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై ఉత్తమ్ అసంతృప్తి? ..కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చ

కలం, వెబ్ డెస్క్ : నల్గొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల స్థానానికి (Telangana Graduate MLC Elections) కాంగ్రెస్ పార్టీ రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో ఈ నిర్ణయం వెలువడినట్లు కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది.

అయితే అభ్యర్థి ఎంపికపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అసంతృప్తిగా ఉన్నారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. తన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ విషయంపై అధికారికంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి స్పందన వెలువడలేదు.

రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాజీ మంత్రి, దివంగత కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు. ఈ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్‌లో పలువురు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ఎన్నికల ప్రకటనకు ముందు వార్తలు వచ్చాయి.

అయితే సర్వోత్తమ్ రెడ్డి పేరును అధిష్ఠానం ఖరారు చేయడంతో టికెట్ ఆశించిన ఇతర నేతల రాజకీయ సమీకరణాలపై చర్చ మొదలైంది. ముఖ్యంగా పటేల్ రమేశ్ రెడ్డికి అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. దీనిపై అధికారిక ధృవీకరణ లేదు. వచ్చే ఏడాది మార్చిలో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కానుంది. ఇప్పటికే ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, తుది ఓటర్ల జాబితా డిసెంబర్ 30న విడుదల కానుందని సమాచారం.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>