పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ డెడ్‌‌లైన్!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ (Ethics Committee) సమావేశం ముగిసింది. ఈ భేటీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy)కి తన వివరణ సమర్పించేందుకు వచ్చే నెల 7వ తేదీ వరకు కమిటీ గడువు పొడిగించింది. శాసనసభలో జరిగిన చర్చకు సంబంధించిన దృశ్యాలను విశ్లేషించేందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) మాట్లాడిన పూర్తి వీడియో ఫుటేజ్ కావాలని బీఆర్‌ఎస్ ప్రతినిధులు కోరగా, అందుకు కమిటీ సుముఖత వ్యక్తం చేసింది.

వీడియో అందించడానికి అంగీకరించింది. ఈ వ్యవహారంపై తదుపరి చర్చలు, సమగ్ర పరిశీలన జరిపేందుకు ఎథిక్స్ కమిటీ వచ్చే నెల 8వ తేదీన మరోసారి సమావేశం కానుంది.

Also Read : ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై ఉత్తమ్ అసంతృప్తి? ..కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>