కలం, వెబ్ డెస్క్: భారత్ లోని ప్రముఖ ఐఐటిలో ఒకటి అయిన ఐఐటి రూర్కి (IIT Roorkee) లో గ్రాడ్యుయేట్ విద్యార్థి ఆత్మహత్యకు చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. సెకండ్ ఇయర్ చదువుతున్న ఆయూష్ రజౌరియా (20) గురువారం రాత్రి తన గదిలో విగత జీవిగా పడి ఉండడంతో క్యాంపస్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఆయుష్ ఏడాది కాలంగా డిప్రెషన్ సమస్యలతో బాధపడుతున్నాడు. క్యాంపస్‌లోని వెల్‌నెస్ సెంటర్‌లో కౌన్సెలింగ్ కూడా తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి తన స్నేహితుడు అతడిని చూడటానికి వెళ్లగా చనిపోయి ఉన్నాడు. పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్యాంపస్ విద్యార్థి మృతి నేపథ్యంలో ఐఐటీ రూర్కీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం జరగాల్సిన 70 పరీక్షలను నవంబర్ 22వ తేదీకి వాయిదా వేశారు.

