చివరి నిమిషంలో సాంకేతిక లోపం.. స్పేస్‌ఎక్స్ బూస్టర్ బ్లాస్ట్!

కలం, వెబ్ డెస్క్ : అంతరిక్ష ప్రయోగాలలో మరో కీలక ఘట్టానికి సిద్ధమైన స్పేస్‌ఎక్స్ సంస్థకు నిరాశ ఎదురైంది. టెక్సాస్‌లోని స్టార్‌బేస్ వేదికగా నవంబర్ 14న నిర్వహించిన 15వ టెస్ట్ ఫ్లైట్ ప్రయోగంలో చివరి నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తడంతో సూపర్ హెవీ బూస్టర్ (SpaceX Booster) పేలిపోయింది.

ప్రయోగంలో భాగంగా రాకెట్‌ను నింగిలోకి పంపిన అనంతరం, తిరిగి అదే లాంచ్ ప్యాడ్‌కు సురక్షితంగా చేరుకునేలా స్పేస్‌ఎక్స్ ప్రణాళిక రూపొందించింది. ముఖ్యంగా చాప్‌స్టిక్స్ మెకానికల్ ఆర్మ్స్ సహాయంతో ఈ భారీ హెవీ బూస్టర్‌ను గాల్లోనే ఒడిసిపట్టాలని (క్యాచ్) సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, రాకెట్ పైభాగం నుంచి బూస్టర్ వేరుపడిన కొద్దిసేపటికే అందులో సాంకేతిక సమస్య మొదలైంది.

గాల్లో ఉండగానే బూస్టర్‌లో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన స్పేస్‌ఎక్స్ అధికారులు అప్పటికప్పుడు క్యాచ్ ప్రయత్నాన్ని విరమించుకుని మిషన్‌ను రద్దు చేశారు. అనంతరం ఆఫ్‌షోర్ ల్యాండింగ్ ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే ఆ హెవీ బూస్టర్ భారీ శబ్దంతో పేలిపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>