బైక్‌ను ఢీకొట్టిన లారీ.. యువకుడు దుర్మరణం

కలం, మామడ: మామడ మండలం తాండ్ర గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. స్థానికులు, 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సోన్‌పేట గ్రామానికి చెందిన గోరే భూమేష్, తోట గణేష్ (23) శనివారం ద్విచక్ర వాహనంపై ఇచ్చోడ మండలం పిప్రి గ్రామానికి బయలుదేరారు.

ఈ క్రమంలో తాండ్ర గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తోట గణేష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భూమేష్‌కు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ ఆగకుండా అక్కడి నుంచి పరారైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి పరారైన లారీ కోసం దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>