కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో భూముల ధరల సవరణకు (Telangana Land) తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్కెట్ ధరలు.. ప్రభుత్వ విలువల మధ్య వ్యత్యాసాన్ని సవరించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సవరించిన భూముల మార్కెట్ విలువలు రేపటి (గురువారం) నుంచి అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు.
నిర్మాణ సామాగ్రి ధరల పెరుగుదలతో రేట్లు పెంచినట్లు తెలిపారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ అభివృద్ధి తో రేట్ల పెరిగాయన్నారు. నిపుణులు, అధికారుల సూచనలు.. సలహాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి చెప్పారు. భూలావాదేవీల్లో పారదర్శకతే లక్ష్యంగా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా పున: పరిశీలన చేసినట్లు వివరించారు. అధిక మార్కెట్ ధరలు ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి రేట్ల పెంపు లేదని మంత్రి స్పష్టం చేశారు.

