ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ రేసులో జస్టిన్ లాంగర్!

కలం, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ పురుషుల టెస్ట్ జట్టు కొత్త హెడ్ కోచ్ రేసులో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ (Justin Langer) అందరికంటే ముందంజలో ఉన్నారు. గత వారమే బ్రెండన్ మెక్‌కలమ్‌ను ఈ పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తయారు చేసిన షార్ట్‌లిస్ట్‌లో లాంగర్ అగ్రస్థానంలో నిలిచారు. ఆస్ట్రేలియా ఆటగాడిగా, కోచ్‌గా లాంగర్‌కు మంచి అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయన ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు, ‘ది హండ్రెడ్’ టోర్నీలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా పనిచేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన ఇంగ్లాండ్ బాధ్యతలు చేపట్టాలంటే, ఫ్రాంచైజ్ క్రికెట్ ఒప్పందాలను వదులుకోవాల్సి రావచ్చు. లక్నో జట్టుతో విడిపోవడానికి ఆయన సుముఖంగా ఉన్నారని, త్వరలోనే ఈసీబీతో చర్చలు జరగనున్నాయని సమాచారం. వచ్చే నెలలో పాకిస్తాన్‌తో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌కంటే ముందే కొత్త కోచ్‌ను నియమించాలని బోర్డు భావిస్తోంది. కాంట్రాక్ట్ సమస్యలు సమసిపోతే లాంగర్ ఎంపిక ఖాయంగా కనిపిస్తోంది.

మరోవైపు, టీమిండియా మాజీ కోచ్‌లు రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్ పేర్లు ప్రచారంలోకి వచ్చినా, వారిద్దరూ ఈ రేసులో లేరని స్పష్టమైంది. అలాగే ఆండీ ఫ్లవర్ కూడా ఈ పదవిని చేపట్టడం లేదని ఇప్పటికే ప్రకటించారు. మెక్‌కలమ్ నాయకత్వంలో ఇంగ్లాండ్ జట్టు 27 విజయాలు, 2 డ్రాలు సాధించగా, 20 మ్యాచుల్లో ఓడిపోయింది. ముఖ్యంగా చివరి తొమ్మిది టెస్టుల్లో ఏడింటిలో ఓడిపోవడంతో జట్టు ప్రదర్శన బాగా పడిపోయింది.

న్యూజిలాండ్‌పై 3-0తో సిరీస్ గెలిచి అద్భుతంగా ప్రయాణం ప్రారంభించినా, ఆ తర్వాత ఓటములతో ఆయన పదవీకాలం ముగిసింది.ఈ పదవి నుంచి తప్పుకున్న తర్వాత మెక్‌కలమ్ స్పందిస్తూ, ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు కోచ్‌గా పనిచేయడం తనకెంతో గర్వకారణమని చెప్పారు. ఈ ప్రయాణంలో కొన్ని గెలుపులు, కొన్ని ఓటములు ఉన్నాయని, సవాళ్లను ఎదుర్కోవడంలో అవీ ఒక భాగమేనని వ్యాఖ్యానించారు.

తనకు సహకరించిన ఆటగాళ్లకు, స్టాఫ్‌కు, అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ డ్రెస్సింగ్ రూమ్‌లో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారని, భవిష్యత్తులో ఈ జట్టు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>