నర్సాపూర్ లో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

కలం, మెదక్ బ్యూరో : మెదక్ జిల్లా నర్సాపూర్ (Narsapur) లోని బీవీఆర్‌ఐటీ (BVRIT) ఇంజనీరింగ్ కళాశాలలో తీవ్ర విషాదం నెలకొంది. కెమికల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న శంకర్ (19) అనే విద్యార్థి నర్సాపూర్‌లోని తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ​మృతుడు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ​సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>