Mobile Popup Ad
Mobile Popup Ad

గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్

కలం, వెబ్ డెస్క్ : గిగ్, ప్లాట్ ఫామ్ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గిగ్, ఫ్లాట్ ఫామ్ వర్కర్ల సంక్షేమం, భద్రత కోసం రూపొందించిన “తెలంగాణ ప్లాట్ ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్ , సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ) చట్టం (Gig Workers Welfare Bill ) 2026” బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్త బిల్లు ప్రకారం వర్కర్స్ రిజిస్ట్రేషన్ తో పాటు వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తారు. ఈ బిల్లు ప్ర‌కారం.. గిగ్ వ‌ర్క‌ర్ల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన గుర్తింపు, సామాజిక భ‌ద్ర‌త ల‌భించ‌డంతో పాటు వారి సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేయ‌డంతో వారి హ‌క్కుల‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. కాగా, గతంలో మంత్రివర్గం ఆమోదించిన బిల్లును ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన సోషల్ సెక్యూరిటీ కోడ్ కు అనుగుణంగా స్వల్ప మార్పులతో మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాగా, రాష్ట్రంలో ఉన్న దాదాపు 4.2 లక్షల మంది గిగ్ వర్కర్స్, ప్లాట్ ఫారం బేస్డ్ వర్కర్స్ ఈ బిల్లు ఎంతో దోహదపడనుంది.

Read Also: ఉద్యోగులకు భారీ షాక్.. శాలరీ కటింగ్స్ కి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

Follow Us On: Instagram

 

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>