మంత్రి కొండా సురేఖకు భారీ షాక్

కలం, వెబ్ డెస్క్: మంత్రి కొండా సురేఖ (Konda Surekha)కు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఆమె నిర్వహిస్తున్న అటవీ శాఖలో డిప్యూటేషన్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కొండా సురేఖకు సమాచారం ఇవ్వకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశాల నుంచి తిరిగి రావడం, అమెరికా టూర్ రద్దుపై ప్రెస్ మీట్ ముగించిన గంటన్నర లోపే ఈ నిర్ణయం వెలువడటంతో రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఈ రోజు ఉద‌య‌మే కొండా సురేఖ వ‌న మ‌హోత్స‌వం కార్య‌క్ర‌మంపై అట‌వీ శాఖ అధికారుల‌తో రివ్యూ మీటింగ్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంలో స‌ర్కార్ నుంచి ఇలాంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌టం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్య‌లు ఆమె త‌ల్లికి తీర‌ని క‌ష్టాలు తెచ్చిపెట్టేలా క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే కొండా సుస్మిత వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ క్ర‌మ శిక్ష‌ణ క‌మిటీ, మంత్రులు, ఎమ్మెల్యేలు బ‌హిరంగంగానే తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. కొండా సురేఖ సీఎంకు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని, ఆమెను మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

సురేఖ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీకి త‌న వివ‌ర‌ణ ఇచ్చినా ఈ విమ‌ర్శ‌లు ఆగ‌డం లేదు. సీఎం రేవంత్ దీనిపై స్పందిస్తూ పార్టీ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నా క‌ట్టుబ‌డి ఉండాల‌ని వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో అస‌లు అధిష్టానం ఆమెపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్న దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>